Breaking News

ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌!


Published on: 29 Apr 2025 13:47  IST

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ మంగళవారం ప్రకటించింది. 2026 జూన్‌25న ‘ఎన్టీఆర్‌-నీల్‌’ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది.కథకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా చిత్రీకరణకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు సైతం ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి