Breaking News

TG:రేపు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌


Published on: 29 Apr 2025 17:57  IST

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు విద్యాశాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సారి కొత్త‌గా మార్కుల‌తో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌ది ప‌రీక్ష‌ల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు.  ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ntnews.com వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

 

Follow us on , &

ఇవీ చదవండి