Breaking News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌కి కాంగ్రెస్ టికెట్


Published on: 23 Oct 2025 18:22  IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఇవాళ(గురువారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకి గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు కేసీఆర్. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement