Breaking News

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్


Published on: 30 Apr 2025 12:40  IST

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయుని పాలెంలో ఈరోజు (బుధవారం) షర్మిల పర్యటించాలని నిర్ణయించారు.పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి