Breaking News

ఏపీ దేశానికి గేట్‌వేలా మారుతోంది..


Published on: 14 Nov 2025 18:39  IST

దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్‌ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడిదారుల లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని తెలిపారు. వైజాగ్‌లో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్‌ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని.. 2047లోగా భారత్‌ నంబర్‌వన్‌ ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే ఇండియాకు తిరుగు ఉండదని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి