Breaking News

చొరబాటుకు యత్నం..పాక్‌ జాతీయుడి కాల్చివేత


Published on: 08 May 2025 16:54  IST

భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన జవాన్లు కాల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. చీకటిలో ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి దూసుకురావడాన్ని గమనించి ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అతని దగ్గర నుంచి పాకిస్థాన్‌లో తయారైన వ్యవసాయ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి