Breaking News

ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుంచి బంగారు ఆభరణాలు చోరీ


Published on: 09 May 2025 07:51  IST

కామారెడ్డి బస్టాండ్‌లో గురువారం జరిగిన దొంగతనంలో ఒక ప్రయాణికురాలి బ్యాగులోని ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన సుధేష్ణ, హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఆమె భీమ్గల్ బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సాయంత్రం 5:40 గంటలకు బస్సు ఎక్కిన తర్వాత ఆమె బ్యాగ్ జిప్పు ఓపెన్ చేసి ఆభరణాలు దొంగిలించబడ్డాయని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి