Breaking News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి స్వాధీనం


Published on: 10 May 2025 22:18  IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని, వారి నుంచి రూ. 1.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు, ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టు అయిన వ్యక్తులను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement