Breaking News

ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం

డిసెంబర్ 30, 2025, మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. 


Published on: 30 Dec 2025 17:10  IST

డిసెంబర్ 30, 2025, మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. 

లక్సెట్టిపేట పట్టణంలోని సీఎస్ఐ (CSI) చర్చి గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది.భగత్ సింగ్ నగర్‌కు చెందిన 9 మంది విద్యార్థులు ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఆరుగురు విద్యార్థులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పట్టణం నుంచి ఆంధ్ర బోర్ వైపు వెళ్తున్న బొలెరో ట్రాలీ, ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.ఆటో డ్రైవర్ రామస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement