Breaking News

శ్రేయ ఇన్‌ఫ్రా 51 ఎకరాల భూములు జప్తు


Published on: 03 Jan 2026 13:34  IST

అధికవడ్డీ ఆశ చూపి,ప్రజలను మోసగించిన కర్నూలుకు చెందిన శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది .ఆ సంస్థకు చెందిన 51.55 ఎకరాలు భూమిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలో ప్రజలను మోసం చేసి, దాదాపు రూ.206 కోట్లతో ఆ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు.. ఆ కేసును సీఐడీకి అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి