Breaking News

వలసలపై బ్రిటన్‌ కఠిన వైఖరి


Published on: 13 May 2025 11:44  IST

విదేశీయుల వలసలపై బ్రిటన్‌ కఠిన వైఖరి అవలంబించనుంది. పౌరసత్వం పొందడం కోసం ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచనుంది. వలసల విధానంపై పార్లమెంటులో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సమర్పించనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని స్టార్మర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వృత్తి, విద్య, కుటుంబం తదితర కేటగిరీల వీసాలపై వచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. నైపుణ్యాలు ఉన్నవారికే పౌరసత్వం మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనుంది బ్రిటన్‌.   

Follow us on , &

ఇవీ చదవండి