Breaking News

మునిసిపల్‌ ఎన్నికలకు ఓకే


Published on: 19 Jan 2026 10:57  IST

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్‌ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ధనసరి సీతక్కతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి