Breaking News

ప్రేమ పేరుతో మోసం. పదేళ్ల శిక్ష


Published on: 19 Jan 2026 18:31  IST

ప్రేమ పేరుతో మోసానికి పాల్పడిన ఓ ఎస్‌ఐ కేసులో జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.యువతిని ప్రేమించానంటూ నమ్మించి మోసం చేసిన ఎస్‌ఐ రవితేజకు న్యాయస్థా నం పదేళ్ల జైలు శిక్ష విధించింది. గుంటూరు జిల్లాలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవితేజ ఓ యువతిని ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఆమెను లైంగికంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడైన ఎస్ఐకి పదేళ్ల శిక్ష విధించింది.

Follow us on , &

ఇవీ చదవండి