Breaking News

ఊపందుకున్న ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం!


Published on: 13 May 2025 17:05  IST

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌ను భారత్‌ చేపట్టగా.. ఆ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎర్డోగాన్‌ ప్రభుత్వం తీరుపై మనదేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా ‘బ్యాన్‌ తుర్కియే’ అంటూ పలువురు వ్యాపారులు కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి