Breaking News

అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను గుట్టురట్టు చేసి, ఒక అంతర్జాతీయ స్మగ్లర్‌తో పాటు ఐదుగురు నిందితుల అరెస్ట్

అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను గుట్టురట్టు చేసి, ఒక అంతర్జాతీయ స్మగ్లర్‌తో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం (17 జూన్ 2026) మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

Published on: 17 Jun 2026 17:47  IST

అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను గుట్టురట్టు చేసి, ఒక అంతర్జాతీయ స్మగ్లర్‌తో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం (17 జూన్ 2026) మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

అంతర్జాతీయ స్మగ్లర: పేరు షేక్ అజ్మల్ ఖాన్ (A1) రామనాథపురం, తమిళనాడు కు చెందిన వ్యక్తి.ఈయన గతంలో శ్రీలంకలో డ్రగ్స్ సరఫరా కేసులో పోలీసులకు దొరికి జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చాడు. శ్రీలంక ప్రభుత్వం ఇతని పాస్‌పోర్టును సీజ్ చేయడంతో, సముద్ర మార్గం ద్వారా అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డాడు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి రవాణా ప్రారంభించాడు.లంకెలపాలెం జంక్షన్ వద్ద పరవాడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సామాగ్రి:

గంజాయి: ₹1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి

నగదు: ₹95,240

వాహనాలు: ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక బైక్

ఇతరాలు: 4 మొబైల్ ఫోన్లు

అరెస్ట్ అయిన ఇతర నిందితులు:

షేక్ అబ్దుల్ రెహ్మాన్ (అజ్మల్ ఖాన్ సోదరుడు)

రాజా (తమిళనాడు)

శెట్టి రవికుమార్ (పెదబయలు మండలం, గోమంగి గ్రామం)

శ్యామ్ (ఒడిశా)

ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement