Breaking News

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులైన అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2026, జూన్ 20న రూ.2,000 చొప్పున నిధులు నేరుగా జమ కానున్నాయి.


Published on: 17 Jun 2026 19:13  IST

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23 విడత నిధుల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులైన అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2026, జూన్ 20 రూ.2,000 చొప్పున నిధులు నేరుగా జమ కానున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.

ముఖ్యమైన అర్హతలు & నిబంధనలు

డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఈ పనులు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి:

eKYC పూర్తి చేయడం: పీఎం కిసాన్ పోర్టల్‌లో రైతులు తమ eKYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

ఆధార్ సీడింగ్: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.

భూమి వివరాల అనుసంధానం: మీ భూమి వివరాలు పోర్టల్‌లో అప్‌డేట్ అయి ఉండాలి.

బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే విధానం

మీ అకౌంట్లో డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా తనిఖీ చేయండి:

కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ PM-Kisan Portal ను సందర్శించండి.

అక్కడ హోమ్‌పేజీలో ఉన్న 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేస్తే మీ అర్హత మరియు గత విడతల పూర్తి స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు సమాచారం: ఈ జూన్ 20న కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులతో పాటు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' పథకం మొదటి విడత నిధులను కూడా అదే రోజున కలిపి విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement