Breaking News

ఢిల్లీలో ఎర్రకోట పేలుడు – హై అలర్ట్ జారీ, ఎనిమిది మంది మృతి

ఢిల్లీలో ఎర్రకోట పేలుడు – హై అలర్ట్ జారీ, ఎనిమిది మంది మృతి


Published on: 11 Nov 2025 10:05  IST

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన 15 మందిని వెంటనే ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, అందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.

పేలుడు సోమవారం సాయంత్రం 6:52 గంటలకు చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతతో పది వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐ20 కారు ఈ ఘటనకు కారణమని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఆ కారు మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చింది, సాయంత్రం 6:48కు బయలుదేరిన కొద్ది సేపటికే పేలుడు జరిగింది.

ఈ కారును గురుగ్రామ్ ఆర్టీవోలో HR26CE7674 నంబరుతో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ మహ్మద్ సల్మాన్ పేరుతో ఉన్నప్పటికీ, ఆయన విచారణలో ఆ వాహనాన్ని పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి అమ్మినట్లు తెలిపాడు. అధికారులు ప్రస్తుతం మహ్మద్ ఉమర్ అనే వైద్యుడి పాత్రపై దృష్టి సారించారు, ఆయనకు ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

పేలుడు తర్వాత ఎర్రకోట పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, బాంబ్ మూలం, నిందితుల నేపథ్యం, డ్రోన్ లింకులు వంటి అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి