Breaking News

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి కేసు (FIR) నమోదు చేశారు. 'ఓటు చోరీ' ఆరోపణలు చేస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


Published on: 08 Oct 2026 18:57  IST

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి కేసు (FIR) నమోదు చేశారు. 'ఓటు చోరీ' ఆరోపణలు చేస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నిరసన ప్రదర్శన: 'ఓటు చోరీ' కుట్ర మరియు ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు.

పోలీసుల అడ్డగింత: ఈ నిరసన ర్యాలీని నితీ ఆయోగ్ కార్యాలయం వెలుపల ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆకాశవాణి భవన్‌లోకి ఎంట్రీ: పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ మద్దతుదారులతో కలిసి మధ్యాహ్నం 1 గంటల సమయంలో సమీపంలోని ఆకాశవాణి భవన్‌ (ఆల్ ఇండియా రేడియో) ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ భైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రియాంక గాంధీ మహిళా నేతలతో కలిసి రోడ్డుపై పడుకుని ఆందోళన నిర్వహించారు.

బలవంతపు అరెస్టులు: అనంతరం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు ఆకాశవాణి భవన్ నుండి రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు ఎంపీలను బలవంతంగా ఈడ్చుకెళ్లి, వ్యాన్‌లలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వారిని విడుదల చేశారు.

ఎఫ్ఐఆర్ (FIR) లోని ఆరోపణలు

అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్‌లోకి బలవంతంగా చొరబడ్డారనే ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

అనుమతి లేని ప్రవేశం: ఆకాశవాణి భవన్‌లోకి అక్రమంగా చొరబడటం.

విధులకు ఆటంకం: విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల పనికి అడ్డుతగలడం.

పోలీసులపై దాడి: నిరసన ప్రదర్శనలో పోలీసులతో నెట్టివేతలకు (ధక్కా-ముక్కీ) పాల్పడటం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం.

కాంగ్రెస్ స్పందన

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రధానమంత్రి, హోంమంత్రి మరియు సీఈసీ కలిసి పన్నిన 'ఓటు చోరీ' కుట్రను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. లోపాలను ఎత్తిచూపడానికి రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' మార్గాన్ని ఎంచుకుంటే, కేంద్రం మాత్రం పోలీసులు ఉపయోగించి 'ఎఫ్ఐఆర్' నమోదు చేయిస్తోందని ఆయన విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement