Breaking News

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిసమక్షంలో  30 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిసమక్షంలో ఏప్రిల్ 10, 2026న 30 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు (ఏప్రిల్ 10) మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో వీరి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Published on: 10 Apr 2026 12:55  IST

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిసమక్షంలో ఏప్రిల్ 10, 2026న 30 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు (ఏప్రిల్ 10) మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో వీరి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

పీఎల్జీఏ (PLGA) డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో పాటు సుమారు 30 మంది కేడర్ జనజీవన స్రవంతిలోకి రానున్నారు.

వీరి నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ (SLR), ఇన్సాస్ రైఫిల్స్‌తో సహా దాదాపు 50 వరకు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.పోలీసుల నిఘా పెరగడం, మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి, మరియు ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, నగదు పురస్కారాలు, మరియు తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి