Breaking News

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి పూర్తిగా వైదొలగడానికి సిద్ధమవుతోంది

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి పూర్తిగా వైదొలగడానికి (Goodbye చెప్పడానికి) సిద్ధమవుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ టెక్ మీడియా సంస్థ WinFuture కథనం ప్రకారం, వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' తమ గ్లోబల్ వ్యాపార వ్యూహాల్లో భాగంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.


Published on: 14 Jul 2026 15:23  IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి పూర్తిగా వైదొలగడానికి (Goodbye చెప్పడానికి) సిద్ధమవుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ టెక్ మీడియా సంస్థ WinFuture కథనం ప్రకారం, వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' తమ గ్లోబల్ వ్యాపార వ్యూహాల్లో భాగంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

అధికారిక ప్రకటన: దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉంది.

భారత్‌లో పరిస్థితి: ఈ నిర్ణయం వల్ల భారత్ , చైనా మార్కెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. భారత్‌లో వన్‌ప్లస్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే, రాబోయే రోజుల్లో భారత్‌లో ఒప్పో సబ్‌బ్రాండ్‌గా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను వన్‌ప్లస్ సిరీస్ కింద విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత వినియోగదారులు: ఇప్పటికే అమెరికా, యూరప్‌లలో వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న వారికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ సపోర్ట్ వారి ఫోన్ల లైఫ్‌సైకిల్ ముగిసేవరకు అందుతాయి.

కొత్త ఫోన్ల నిలిపివేత: పశ్చిమ దేశాల్లో ప్రస్తుతం స్టాక్ ఉన్న ఫోన్లను అమ్మేసాక, అక్కడ ఎలాంటి కొత్త వన్‌ప్లస్ మోడళ్లను లాంచ్ చేయరు. ఇప్పటికే యూరప్‌ ఆన్‌లైన్ స్టోర్లలో స్టాక్ దాదాపుగా అయిపోవచ్చింది.

ఖచ్చితమైన కారణాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన విడిభాగాల (ర్యామ్, చిప్స్) ధరలు, గట్టి పోటీ మరియు ఒప్పో గ్రూప్ అంతర్గత పునర్వ్యవస్థీకరణ దీనికి కారణాలని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు "ఫ్లాగ్‌షిప్ కిల్లర్"గా గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్, పాశ్చాత్య దేశాల మార్కెట్లకు గుడ్‌బై చెప్పనుండడం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి