Breaking News

రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి (మార్చి 4, 2026) ఢిల్లీలో భేటీ అయ్యారు.తెలంగాణలో పెరుగుతున్న పరిపాలనా, భద్రతా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు.


Published on: 05 Mar 2026 12:34  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి (మార్చి 4, 2026) ఢిల్లీలో భేటీ అయ్యారు.తెలంగాణలో పెరుగుతున్న పరిపాలనా, భద్రతా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఉన్న 83 మంది అధికారుల సంఖ్యను 105కి పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఇటీవలే పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం, వారి పునరావాసం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. గత రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని సీఎం కేంద్రమంత్రికి వివరించారు.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావలసిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి