Breaking News

దివంగత టాలీవుడ్ అగ్రకథానాయకుడు, నటభూషణ్ శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు.

దివంగత టాలీవుడ్ అగ్రకథానాయకుడు, నటభూషణ్ శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (జూలై 9) సాయంత్రం తుదిశ్వాస విడిచారు.


Published on: 10 Jul 2026 10:17  IST

దివంగత టాలీవుడ్ అగ్రకథానాయకుడు, నటభూషణ్ శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (జూలై 9) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇవాళ, జులై 10, 2026 (శుక్రవారం) చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వయోసహజ అనారోగ్య సమస్యల వల్ల ఆమెను నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.గురువారం సాయంత్రం ఆసుపత్రిలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక ఆప్తమిత్రురాలితో మాట్లాడుతుండగా, ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో కన్నుమూశారు.

శోభన్ బాబు, శాంతకుమారిల వివాహం 1958 మే 15 జరిగింది.ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు (మృదుల, ప్రశాంతి, నివేదిత), ఒక కుమారుడు (కరుణ శేషు) ఉన్నారు.శోభన్ బాబు టాలీవుడ్‌లో అగ్ర హీరోగా (సోగ్గాడుగా) కోట్లాది ఆస్తులు, క్రేజ్ సంపాదించినప్పటికీ, శాంతకుమారి గారు ఎప్పుడూ ప్రచారానికి, ఆడంబరాలకు దూరంగా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.2008లో శోభన్ బాబు గారు గుండెపోటుతో మరణించిన తర్వాత, ఆమె చెన్నైలోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు.శాంతకుమారి గారి మరణవార్త తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు, సినీ విశ్లేషకులు, శోభన్ బాబు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి