Breaking News

గురువారం రాత్రి పాకిస్థాన్ సైన్యం మరోసారి నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడింది.

వరుసగా ఎనిమిదో రోజు ఈ చెత్త పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడడం.ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అక్నూరు వంటి సెక్టర్లలో చోటు చేసుకున్నాయి.


Published on: 02 May 2025 11:00  IST

న్యూఢిల్లీ, మే 2: జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ పై భారత్‌ ఆంక్షలు విధించినా, ఆ దేశం తన చెత్త చర్యలను నిలిపిన దాఖలాలు కనిపించలేదు. గురువారం రాత్రి పాకిస్థాన్ సైన్యం మరోసారి నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడింది. ఇది వరుసగా ఎనిమిదో రోజు ఇలా జరగడం గమనార్హం.ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అక్నూరు వంటి సెక్టర్లలో చోటు చేసుకున్నాయి. పాక్ సైన్యం తరచూ ఇలా కాల్పులకు తెగబడుతున్నా, భారత సైన్యం ప్రతిసారి సమర్థంగా స్పందించి తగిన రీతిలో ప్రతిచర్య చూపుతోంది. ఈ పరిస్థితులపై భారత అధికారులు ఇప్పటికే హాట్‌లైన్ ద్వారా పాకిస్థాన్ అధికారులతో మాట్లాడారు. కానీ, పాక్ మాత్రం తన ధోరణిని మార్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు సంబంధించిన ఉగ్ర సంస్థల ప్రమేయం ఉన్నట్లు భారత్‌కు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై ఆంక్షలు విధించగా, ప్రతిగా పాకిస్థాన్ కూడా భారతదేశంపై ఆంక్షలు విధించింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది.ఇక తాజాగా జరిగిన కాల్పులలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు, పహల్గాం దాడి వెనుక లష్కరే తోయిబాకు అనుబంధమైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఉన్నట్లు తెలిసింది. దీనితో ఉగ్రవాద కార్యకలాపాల్లో హాఫీజ్ సయిద్ పాత్ర ఉందన్న అనుమానంతో పాకిస్థాన్ అతనికి నాలుగు స్థాయిల భద్రత కల్పించింది. భారత్ ఈ దాడిలో అతనికి కీలక పాత్ర ఉందని భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి