Breaking News

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్


Published on: 18 Jul 2025 18:55  IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.మా జ‌గ‌దీశ్ రెడ్డిని ప‌ట్టుకుని మూడు ఫీట్లు అన్న‌డు రేవంత్ రెడ్డి. ఆయ‌నేదో పెద్ద అమితాబ్ బ‌చ్చ‌న్ అన్న‌ట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు. నువ్వేదో పెద్ద పోటుగాడిలాగా మూడు ఫీట్లు అని డైలాగులు. మ‌న‌ది మ‌నం మ‌రిచిపోతే ఎట్ల‌. కొంచెం ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంప‌ర్ వ‌స్త‌దా..? ఎత్తెత్తు షూ వేసుకుని.. ఎత్తెత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడివి అయిపోతావా..? అమితాబ్ బ‌చ్చ‌న్ అయిపోతావా..? అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు.

Follow us on , &

ఇవీ చదవండి