Breaking News

ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు ప్రత్యక్షం..


Published on: 12 Nov 2025 15:15  IST

సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు సుమారు 2వేల నాటుకోళ్లను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడికి చేరి ఆ కోళ్లను పట్టుకెళ్లారు. అనంతరం వాటిని కూరగా వండుకు తిన్నారు. దీంతో ఆరోజు ఆ ఊళ్లో పండుగ వాతావరణమే తలపించింది.! ఈ విషయం జిల్లా వ్యాప్తంగా బట్టబయలు కావడంతో ఆ ఊరి ప్రజలు లక్కీఛాన్స్ కొట్టేశారని పలువురు భావించారు. అయితే.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఓ యజమాని వాటిని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి