Breaking News

దిల్లీ గగనతలంపై ‘సుదర్శన చక్రం’..


Published on: 30 Dec 2025 17:51  IST

దేశ రాజధాని దిల్లీలోని కీలక వీఐపీ-89 జోన్‌లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ సమీకృత ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్స్‌ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ‘సుదర్శన చక్ర (Sudarshan Chakra For Delhi)’ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద దీన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆ కథనం పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి