Breaking News

తొలి దశలో 2310 గ్రామాల్లో అనుభవదారు సర్వే!


Published on: 13 Jan 2026 16:19  IST

రాష్ట్రంలో దశలవారీగా అనుభవదారు (ఎంజాయ్‌మెంట్‌) సర్వేను చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2310 గ్రామాల్లో తొలి దశ సర్వే చేసేందుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత సర్వే ప్రారంభించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇటీవల నియమితులైన 3456 మంది లైసెన్స్డ్‌ సర్వేయర్లను, త్వరలో నియామకం కానున్న మరో 3500 మంది సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement