Breaking News

రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా


Published on: 13 Jan 2026 18:52  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తలసాని స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో తలసాని మాట్లాడుతూ.. ‘సికింద్రాబాద్‌ ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా’ అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement