Breaking News

2027 ఫిబ్రవరిలో జన, కులగణన


Published on: 05 Jun 2025 08:19  IST

దేశ 16వ జన గణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటే కుల గణననూ చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్‌ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జన గణన పూర్తి కానుంది. లద్ధాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 సెప్టెంబరు ఆఖరు నాటికే జన గణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబరు 1ని రెఫరెన్స్‌ తేదీగా ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి