Breaking News

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు


Published on: 25 Jun 2025 11:16  IST

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీలకు ఇచ్చిన హమీ మేరకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి