Breaking News

అహ్మదాబాద్‌లో 2029 వరల్డ్ పోలీస్ గేమ్స్


Published on: 28 Jun 2025 13:01  IST

అహ్మదాబాద్: 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్ లలో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ జరగనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణమని పేర్కొంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రపంచ పోలీసు క్రీడలు జరపడానికి భారత్ ఎంపికైంది. దీనిద్వారా భారత దేశ క్రీడా మౌలిక సదుపాయాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లయింది.

Follow us on , &

ఇవీ చదవండి