Breaking News

పాతబస్తీలో ఈడీ సోదాలు


Published on: 28 Apr 2025 12:38  IST

హైదరాబాద్‌: పాతబస్తీలోని యాకుత్‌పురా, సంతోష్‌నగర్‌లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. భూదాన్‌ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేపట్టారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఈఐపీఎల్‌ కంపెనీ భూములు విక్రయించింది. ఈఐపీఎల్‌ కంపెనీకి సుకూర్‌ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో సుకూర్‌, అతడి బంధువు షర్ఫన్‌, మరో ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిపింది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, మహేశ్వరం తహసీల్దార్‌ను ఈడీ విచారించింది. 

Follow us on , &

ఇవీ చదవండి