Breaking News

22 గంటలు ట్రెక్కింగ్‌ చేసి..పహల్గాంకు ముష్కరులు?


Published on: 28 Apr 2025 14:19  IST

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అమలుచేసేందుకు ఉగ్రవాదులు కష్టతరమైన కొకెర్నాగ్‌ అడవుల గుండా బైసరన్‌ లోయకు కాలినడకన చేరుకున్నట్టు తెలిసింది. ఈ దాడిలో ముగ్గురు పాక్‌ టెర్రరిస్టులు, ఒక స్థానిక ఉగ్రవాది (ఆదిల్‌ థోకర్‌) పాల్గొన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి