Breaking News

విద్యుత్తు సంస్థల్లో అధికారుల నిర్లక్ష్యం


Published on: 28 Apr 2025 20:31  IST

రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కోకు రెగ్యులర్‌ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చర్చ జరుగుతున్నది. ‘పెద్దసార్లు’ ఆఫీసులకు రావడంలేదని తెలుస్తున్నది. ఎప్పుడో ఓసారి చుట్టం చూపుగా వచ్చినా ఫైళ్లు ముట్టుకోవడంలేదని సమాచారం.ముఖ్యమైన నిర్ణయాలు కార్యరూపు దాల్చడంలేదని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిస్కంలలో పైసల్లేనిదే పనులు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి