Breaking News

జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుండగా కేటీఆర్‌కు ప్రమాదం


Published on: 28 Apr 2025 23:50  IST

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుండగా ఆయన గాయపడ్డారు. వెన్నుపూసలో గాయం కావడంతో కొద్దిరోజులు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతా ద్వారా వెల్లడించారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాడు చెరలబడ్డ తెలంగాణ విముక్తి కోసం.. నేడు చెరబట్టిన తెలంగాణ విముక్తి కోసం జనాలు కదిలివచ్చారని కేటీఆర్‌ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి