Breaking News

ఉక్రెయిన్‌లో రష్యా కాల్పుల విరమణ ప్రకటన


Published on: 29 Apr 2025 01:01  IST

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది.రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్‌ వెల్లడించింది. మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి