Breaking News

మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బ‌స్సులు బంద్


Published on: 29 Apr 2025 18:07  IST

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. త‌మ డిమాండ్ల‌పై రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్పందించ‌క‌పోవ‌డంతో.. మే 7వ తేదీ నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేయాల‌ని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణ‌యించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి ఆర్టీసీ బ‌స్సులు బంద్ కానున్నాయి. బ‌స్సుల‌న్నీ డిపోల‌కే ప‌రిమితం కానున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్‌ కమిషనర్‌ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు.

Follow us on , &

ఇవీ చదవండి