Breaking News

ఆ పాకిస్థానీ ఫ్యామిలీకి బిగ్ రిలీఫ్


Published on: 30 Apr 2025 14:06  IST

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్థానీలు వెంటనే భారత్ విడి వెళ్లాలంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు వారికి విధించిన గడువు సైతం ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. అలాంటి వేళ.. విశాఖపట్నంలోని ఒక కుటుంబం సోమవారం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీని కలిసింది. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపింది.అతడికి చికిత్స మరికొంత కాలం అవసరమని తమను విశాఖపట్నంలో ఉండేందుకు అనుమతించాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఆ కుటుంబం అభ్యర్థించింది.

Follow us on , &

ఇవీ చదవండి