Breaking News

సీబీఎస్ఈ పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.


Published on: 31 Oct 2025 16:39  IST

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభవనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి