Breaking News

అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా


Published on: 31 Oct 2025 17:35  IST

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం ఆసీస్‌తో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. దీంతో ఆదివారం సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అభిమానులకు ఓ క్రేజీ హామీ ఇచ్చాడు. సెమీస్‌లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌(Jemimah Rodrigues)తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అందుకు జెమీమా అంగీకరిస్తేనే అని స్పష్టం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి