Breaking News

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కోడ్‌ ఉల్లంఘన..


Published on: 31 Oct 2025 18:53  IST

హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన 58 ఎఫ్‌ఐఆర్‌లు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు నమోదు చేశారు. వీటిలో 14 కేసులు పోటీలో ఉన్న అభ్యర్థులపై ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, పలువురు పార్టీ కార్యకర్తలపై 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం,ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి