Breaking News

బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన అశ్విన్


Published on: 04 Nov 2025 17:07  IST

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా ఈ ఎడిషన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్‌లోని సిడ్నీ థండర్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.అశ్విన్ బీబీఎల్ అరంగేట్రం చేసి ఉంటే చరిత్ర సృష్టించేవాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ ఈ లీగ్‌లో ఆడలేదు. అశ్విన్ ఆడితే.. బీబీఎల్ ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నమోదు అయ్యేది.

Follow us on , &

ఇవీ చదవండి