Breaking News

ఎస్‌బీఐ @ రూ.100 లక్షల కోట్లు


Published on: 05 Nov 2025 11:01  IST

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) సరికొత్త రికార్డును సృష్టించింది. బ్యాంక్‌ మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లుకు చేరుకుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి మంగళవారం తెలిపారు. ఈ మార్చి చివరి నాటికి మరో రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి రూ.105 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. మొత్తం ఆస్తుల విలువపరంగా ప్రపంచంలో 43వ అతిపెద్ద బ్యాంక్‌గా నిలిచిందని సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా శెట్టి వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి