Breaking News

ఓటీటీలోకి ‘జాక్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.


Published on: 05 May 2025 18:36  IST

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాక్‌’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్పై, యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీగా ఇది తెరకెక్కింది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ (jack ott release) కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్‌ పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి