Breaking News

లక్ష కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్‌ ఓకే


Published on: 11 Nov 2025 10:59  IST

రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి , యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా దాదాపు లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి