Breaking News

రెండున్నర కేజీల బంగారు విగ్రహం.


Published on: 05 May 2025 19:00  IST

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటీవల రెండున్నర కేజీల బంగారంతో (విలువ సుమారు రూ.3 కోట్లు) తయారు చేసిన వాసవీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు.

Follow us on , &

ఇవీ చదవండి