Breaking News

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా


Published on: 06 May 2025 18:16  IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్‌ మిత్తల్‌, లోకేశ్ కుమార్‌, కృష్ణభాస్కర్‌లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలను సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

Follow us on , &

ఇవీ చదవండి