Breaking News

100 డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌


Published on: 06 May 2025 18:41  IST

యుద్ధం ముగించేందుకు ఓవైపు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రష్యా- ఉక్రెయిన్‌ పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి.  ఉక్రెయిన్‌పై రష్యా భారీస్థాయిలో విరుచుకుపడడంతో..కీవ్‌ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌ 100కు పైగా డ్రోన్లతో మాస్కోలోని డజనుకు పైగా ప్రాంతాలపై విరుచుకుపడింది. అయితే పలు డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చేసినట్లు రష్యా పేర్కొంది. డ్రోన్‌ దాడుల కారణంగా మాస్కోలోని 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

Follow us on , &

ఇవీ చదవండి