Breaking News

ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వదంతులు..


Published on: 09 May 2025 11:13  IST

భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు, మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారనే వదంతులు సోషల్ మీడియాలో విస్తరిస్తున్నాయి. పాకిస్థాన్ సైబర్ దాడికి సిద్ధమవుతోందని, అందుకే ఏటీఎంలు మూసేస్తారని ఫేక్ మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఏటీఎంలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ తరహా వదంతులను ఎవరూ నమ్మకూడదు, షేర్ చేయకూడదు అని హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి