Breaking News

ఆటోలో యువకుల మృతదేహాలు..


Published on: 03 Dec 2025 18:07  IST

హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. చాంద్రయాణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచిన ఆటోలో మృతదేహాలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు.ఆటోలో యువకుల మృతదేహాలు కనిపించడంతో కంగారుపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతులను మహమ్మద్ జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి